26 కోట్ల చీటింగ్ కేసుపై జీవిత రాజశేఖర్ స్పందించారు

Admin 2022-04-23 02:18:45 ENT


గరుడవేగ నిర్మాత, జ్యో స్టార్ ఎంటర్‌ప్రైజెస్ వ్యవస్థాపకుడు కోటేశ్వరరాజు, ఆయన భార్య హేమ 26 కోట్ల రూపాయల చీటింగ్ ఆరోపణలపై టాలీవుడ్ సీనియర్ నటి జీవిత రాజశేఖర్ స్పందించారు. జీవిత మీడియాతో మాట్లాడుతూ.. కేసు నగరి కోర్టులో ఉందని, కోర్టు తీర్పు తర్వాత అందరికీ నిజానిజాలు తెలుస్తాయని చెప్పారు. తమకు రెండు నెలల క్రితమే సమన్లు అందాయని, కేసు నగరి కోర్టులో ఉందని, రెండు నెలల తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు ఈ అంశాన్ని లేవనెత్తారో తనకు తెలియదని ఆమె అన్నారు.